కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటారు – రేవంత్ రెడ్డి

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటారని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా పై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి కుటుంబానికి అన్ని హోదాలు ఇచ్చింది కాంగ్రెస్ అని.. కాంగ్రెస్ వల్ల వాళ్లకు బ్రాండ్ పెరిగిందన్నారు. ప్రజలను మభ్య పెట్టాలనుకుంటున్నారని ఫైర్ ఆయారు.

కుక్క బిస్కెట్ల కోసం ఆశపడి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక లావాదేవీల కోసం కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అవమానిస్తున్నారని విమర్శించారు. బీజేపీ వేసిన ఎంగిలి మెతుకులకు ఆశపపడ్డారని ఆరోపించారు.

మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని సోనియా గాంధీ ప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ అనీ.. అలాంటి తల్లిని ఈడీ ద్వారా అవమానిస్తున్నారన్నారు. తల్లిని అవమానించిన వారి తల తెగనరకాలని.. అలాంటి వారిపై పోరాడాల్సిన సమయంలో.. అమిత్ దగ్గర కూర్చుని కాంట్రాక్టుల లెక్కలు చూసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.