రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిధిలోని జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ప్రజాకోర్టు తీర్పు ఇవ్వాలని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కోరారు.” జన్వాడ ఫామ్ హౌస్ డ్రోన్ కేసులో నన్ను జైల్లో పెట్టారు.అక్కడ కేటీఆర్ నివాసం ఉంటున్నారని ఆయన ప్రాణాలకు హాని తలపెట్టానని పోలీసులు కోర్టుకు నివేదించారు కానీ ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ ది కాదన్న వాదనకు హైకోర్టు అనుకూలమైన తీర్పునిచ్చింది.నిజం” ప్రజాకోర్టులో తేలాలి” అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
అయితే గతంలో111 జీవోను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని, హైదరాబాద్ శివారులో జన్వాడ లోని గండిపేట చెరువు కు వెళ్ళే దారిలో కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.ఈ ప్రాంతం 111 జీవో పరిధిలోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని రేవంత్ గతంలో ఎన్టీజీ లో నూ పిటిషన్ వేశారు. ఎన్ టి జి ఉత్తర్వులపై మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.అయితే దీనిపై తాజాగా హైకోర్టు ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ ది కాదని తీర్పునిచ్చింది.
జన్వాడ ఫామ్‌హౌస్ డ్రోన్ కేసులో
నన్ను జైల్లో పెట్టారుపోలీసులు అక్కడ కేసీఆర్ కుమారుడు, కేటీఆర్ నివాసం ఉంటున్నారని…
ఆయన ప్రాణాలకు హాని తలపెట్టానని
కోర్టుకు నివేదించారు.హైకోర్టులో @KTRTRS కి ఫాంహౌస్ తనది కాదన్న వాదనకు అనుకూలమైన
తీర్పు వచ్చిందినిజం…’ప్రజా కోర్టు’ తేల్చాలి pic.twitter.com/hs9iVKT9ku
— Revanth Reddy (@revanth_anumula) April 28, 2022