తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్..ఇవాళ ఆ స్కూళ్లు, కాలేజీలకు సెలవు

-

తెలంగాణలో ఇవాళ జరగనున్న గ్రూప్‌-4 పరీక్షకు సర్వం సిద్ధమైంది. నియామక పరీక్షల్లో అత్యధికంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల అభ్యర్థులు రాయనున్న గ్రూప్-ఫోర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 878 కేంద్రాలు సిద్ధం చేశారు. పరీక్షకు 15 నిమిషాల ముందుగానే గేట్లు మూసివేయనున్నట్లు టీఎస్పీఎస్పీ ప్రకటించింది. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 878 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పేపర్-వన్‌ జనరల్ స్టడీస్… మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-టూ సెక్టరేరియల్ ఎబిలిటీస్ ఉంటుంది. అయితే గ్రూప్‌-4 ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన స్కూల్లో మరియు కాలేజీలకు విద్యాశాఖ నిన్న సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలవు ఉన్న విద్యాసంస్థలు జులై 8వ తేదీన అంటే రెండో శనివారం వర్కింగ్ డే గా ఉండనుంది. ఆ రోజున ఖచ్చితంగా విద్యార్థులు… హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version