పాల్వంచ ఘటనలో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవకు మరో షాక్ తగిలింది. 2001 లో నమోదు అయిన కేసు విచారణకు రావాలని మణుగూరు పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఈ రోజు మధ్యహ్నం 12 : 30 గంటల వరకు మణుగూరు ఏఎస్పీ శబరీష్ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను పాల్వంచలోని వనమా రాఘవ ఇంటి వద్ద పోలీసుల అంటించారు.
కాగ పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ తన కుటుంబం తో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తమ చావులకు కారణం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ అని నాగ రామకృష్ణ తన సెల్ఫీ వీడియో ద్వారా తెలిపాడు. దీంతో వనమా రాఘవను అరెస్టు చేయడానికి కొత్తగూడెం పోలీసులు ఎనమిది బృందాలతో తెలంగాణ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లలో గాలిస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో వనమా రాఘవ పై 2001 లో నమోదు అయిన కేసులో విచారణ కు హాజరు కావాలని మణుగూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఈ రోజు మధ్యాహ్నం వరకు విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. అయితే ఇప్పుడు వనమా రాఘవ బయటకు వస్తాడా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే ఈ రోజు విచారణకు హాజరు కాకపోతే.. వనమా రాఘవ పై మణుగూరు పోలీసులు కూడా అరెస్టు వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది.