ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటే పార్టీలకు అతీతంగా అందరూ ఆమెను అభిమానిస్తుంటారు. ఆమె పేద ప్రజలకు చేసే సేవలు ఎందరికో ఆదర్శం. ఇక రీసెంట్ ఆమె తల్లికి కరోనా వచ్చింది. పరిస్థితి విషమించడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే బ్లడ్ ఇచ్చేందుకు సీతక్క కుటుంబ సభ్యులు పర్మిషన్‌తో హైదరాబాద్ వెళ్తుండగా మల్కాజిగిరి డీసీపీ రక్షిత అడ్డుకున్నారు.
దీనిపై సీతక్క చాలా ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక ఎమ్మెల్యేగా ఎంతోమందికి సేవ చేస్తుంటే.. తన తల్లికి బ్లడ్ అవసరమై హైదరాబాద్ కు వస్తున్న తన బంధువులను అడ్డుకోవడం దారుణమన్నారు. డీసీపీ రక్షిత తన బంధువులను దాదాపు 30నిముషాలు అపేశారని చెప్పారు.
తాను వీడియో కాల్ చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ డీసీపీ రక్షిత వినిపించుకోలేదని, ఒక ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే… సాధారణ జనం పరిస్థితి ఏంటని సీతక్క ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో నెటిజన్లు డీసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారిపై ఇలా చేయడం మంచిది కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.