తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో సీఎం కేసీఆర్ భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా బీజేపీ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని సీఎం కేసీఆర్ కలిశారు. అయితే దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవినీతిలో కెసిఆర్ పీహెచ్డీ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను, విద్యార్థులు అలాగే యువతను కెసిఆర్ మోసం చేశారని మండిపడ్డారు. దళితుల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తరువాత మూడెకరాల భూమి పథకాన్ని ఎత్తివేశారు అని… దళితుడిని సిఎం చేస్తానన్న హామీని మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పథకాలు లోనూ కెసిఆర్ అవినీతికి పాల్పడ్డారని… వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ కు ఓటమి తప్పదని హెచ్చరించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా ప్రజలకు మంచి చేసే ఏర్పాటు అవసరమని వ్యాఖ్యానించారు.