సోనూసూద్ సూప‌ర్‌హీరో.. కేటీఆర్ ప్ర‌శంస‌లు

క‌రోనా కాలంలో బ‌లంగా దేశ‌వ్యాప్తంగా వినిపిస్తున్న ఒకేఒక్క పేరు సోనూసూద్‌. అన్ని రాష్ట్రాల‌క త‌న‌వంతు సాయం చేస్తున్నాడు ఈ రియల్ హీరో. ఇప్ప‌టికే ఆక్సిజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాడు. ఇంటికే అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ కాన్సిన్‌ట్రేట‌ర్ల‌ను కూడా పంపిస్తున్నాడు. దీంతో అతడి సేవ‌ల‌ను దేశం మొత్తం కొనియాడుతోంది.

ఇప్పుడు తాజాగా కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. ప్రముఖ నటుడు సోనూసూద్ ను సూపర్ హీరో అంటూ ప్రశంసించారు. అయితే ఆ వెంటనే సోనూసూద్ కూడా కేటిఆర్ సార్ మీరే హీరో అంటూ బదులు ఇవ్వడం గ‌మ‌నార్హం.

ఇలా వీరి మ‌ధ్య ట్విట్ట‌ర్‌లో సంభాషణ మొద‌లైంది. అసలు విషయం ఏంటంటే.. నంద కిశోర్ తోకల అనే ఓ నెటిజన్ కేటీఆర్ కు ట్విట్ట‌ర్ వేదిక‌గా కృతజ్ఞతలు తెలిపాడు. త‌నకు అవ‌స‌ర‌మైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను అడిగిన 10 గంటలలోపే సమకూర్చారని ధ‌న్య‌వాదాలు తెలిపాడు. సూపర్ హీరో కేటీఆర్” అని నందకిశోర్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పై మంత్రి స్పందిస్తూ.. తాను సూపర్ హీరో కాద‌ని.. సూపర్ హీరో అని ‘సోనూసూద్’ను పిలవచ్చు అని కేటీఆర్ రీట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.