తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు ప్రభుత్వం నిరూపిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేయబోనని స్పష్టం చేశారు. విద్యుత్ లేక పంటలు ఎండపోతున్నాయన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని, కడవరకు పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు.
పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పారదర్శకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 15వ తేదీన ఇస్తున్నారు. ఝార్ఖండ్ లో కూడా ఒకటో తేదీనే జీతాలు పడుతాయి. రాష్ట్ర మంత్రులు నాతో వస్తే కర్ణాటకలో అమలు అవుతున్న పథకాలు చూపిస్తానని పేర్కొన్నారు. స్పెషల్ ఫ్లైట్ పెడుతాను. ఏపీ, కర్ణాటకలో బీజేపీ ఎందుకు పోటీ చేయలేదు..? అని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.