హైకోర్టు, సుప్రీంకోర్టులో ఓబీసీ జడ్జిలకు స్థానం కల్పించాలి : శ్రీనివాస్ గౌడ్

-

స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 ,70 కోట్ల జనాభా ఉన్న ఓబీసీల కు రాజకీయంగా, సామాజికంగా అన్యాయం జరిగింది అని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీజేపీ,కాంగ్రెస్ అందరూ ఓబీసీ లకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తున్నారు. రాజకీయంగా స్థానం లేకుండా ఉంటే చట్టసభల్లో రాజకీయంగా ఉండకపోతే ఉపయోగం ఏమిటి. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఓబీసీలకు న్యాయం చేయాలని అంటున్నారు. మండల కమిషన్ వేసిన అమలు కావడం లేదు. బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ జాతీయ ఓబీసీ స్టూడెంట్స్ సమావేశం లో చర్చలు జరిపాం. ఓబీసీ జనాభా దేశంలో 60 శాతం పైనే ఉన్నారు.

సుప్రీంకోర్టులో ఒకే జడ్జి ఓబీసీ ఉన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి అమలు చేయాలి. గవాయ్ ఒక్కరే ఓబీసీ జడ్జి ఆయన కూడా వచ్చే నెలలో రిటైర్డ్ అవుతారు. రాజ్యాంగ స్ఫూర్తిని సుప్రీంకోర్టులో అమలు చేయాలి. సెంట్రల్ యూనివర్సిటీలో ఓబీసీ ప్రొఫెసర్లు 4 శాతం మాత్రమే ఉన్నారు.. లక్షల్లో పీహెచ్ డీ స్టూడెంట్స్ ఉన్న అర్హులు లేరని నియమించడం లేదు. తెలంగాణ కు అనేక రంగాల్లో నష్ట జరుగుతుంది. తమిళనాడులో ఓసి సీఎంగా జయలలిత ఉన్న ఓబీసీలకు న్యాయం చేయాలని అన్నారు. చట్ట సభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. తమిళనాడులో అనేక మంది సీఎంగా చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు కలిపించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ ఓబీసీలకు 34 శాతం సీట్లు ఇస్తామని చెప్పారు.. ఇవ్వలేదు ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేట్ ఉద్యోగాలు దేశంలో చాలా ఉన్నాయి. ఓబీసీ రిజర్వేషన్లు చట్ట సభల్లో,ప్రైవేట్ లో అమలైతే ఓబీసీలకు న్యాయం జరుగుతుంది. కోర్టులోనే రాజ్యాంగ వ్యవస్థ వ్యతిరేకంగా ఉంటే, ఇంకెవరు ఏం చేస్తారు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఓబీసీల జడ్జిలకు స్థానం కల్పించాలి 80% జనాభాలో ఒక్క జడ్జి కూడా ఓబీసీలు లేరు ప్రధానమంత్రి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేయాలి అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version