రేవంత్ రెడ్డిని కలిసిన న‌ర్సులు

-

తెలంగాణలో ఉద్యోగం నుంచి తొలగించబడిన కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్‌ న‌ర్సులు శనివారం టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డిని కలిసారు. తొల‌గించిన స్టాప్ న‌ర్సుల‌ను తిరిగి డ్యూటీలోకి తీసుకునే విధంగా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటూ ఈ సందర్భంగా వారు రేవంత్ రెడ్డికి విన‌తి ప‌త్రం అందజేశారు. కాగా క‌రోనా విజృంభించిన వేళ ప్రాణాల‌ను సైతం పణంగా పెట్టి క‌రోనా రోగుల‌కు 24 గంట‌ల పాటు సేవ‌లు అందించిన కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్ న‌ర్సుల‌ను ఉద్యోగాల నుంచి తొల‌గించ‌డం హేయ‌మైన చ‌ర్య‌ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉద్యోగం కోల్పోయిన నర్సులకు న్యాయం జ‌రిగే వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని వారికి హామీ ఇచ్చారు.

- Advertisement -
 రేవంత్ రెడ్డి /revanth reddy
రేవంత్ రెడ్డి /revanth reddy

కరోనా సమయంలో దేవుళ్లని పొగిడిన స్టాఫ్ నర్సులు నేడు రోడ్డున పడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. ప్రగతి భవన్, ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయమా? లేక, కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయమా అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు?1600 మంది స్టాఫ్ నర్సులను విధుల్లో కొనసాగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.

కాగా కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న 1640 మంది నర్సులను ఉద్యోగంలో నుంచి తీసేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు నర్సులను విధులకు కావోద్దని చెప్పారు. అయితే కరోనా కష్టకాలంలో ప్రాణాలు ఫణంగాపెట్టి, వేల మంది ప్రాణాలను కాపాడిన తమను రాత్రికి రాత్రే ఉద్యోగం నుంచి తొలగించడంపై నర్సులు అవేదన చెందుతున్నారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందోళన చేసున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...