తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. శశాంక్ గోయల్ ను కేంద్ర సర్వీస్ లకో బదిలీ చేస్తు ఉత్వర్వులు జారీ అయ్యాయి. మంగళ వారం రాత్రి కేంద్ర సిబ్బంది వ్యవహారాలు. శిక్షణ శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న శశాంక్ గోయల్.. కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులు అయ్యారు.
1990 బ్యాచ్ తెలంగాణ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన శశాంక్ గోయల్ ఇక నుంచి కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తారు. అయితే 13 మంది అదనపు కార్యదర్శి స్థాయి అధికారులను మంగళ వారం కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ బదిలీ చేసింది. అందులో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తో పాటు మధ్య ప్రదేశ్ కేడర్ కు చెందిన వీఎల్ కాంతా రావు కూడా ఉన్నారు. వీఎల్ కాంతా రావు కేంద్ర టెలీ కమ్యూనికేషన్స్ శాఖ లో అదనపు కార్యదర్శిగా నియమితులు అయ్యారు.