బాసరలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు త్రాగునీరు నిలిపివేత

బాసర ఆర్జీయూకేటీ (త్రిపుల్ ఐటీ) మెయిన్ గేటు వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులు గేటు దాటి బయటకు రాకుండా పోలీసులు భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. పన్నెండు డిమాండ్లతో మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆరు డిమాండ్లను పరిష్కరిస్తామని.. మిగతా ఐదు డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు అధికారులు. అయితే ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గలేదు.

తమ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎవరో ఒకరు విద్యాలయాన్ని సందర్శించి కచ్చితమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తానని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. అయితే తాజాగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు త్రాగునీటి సరఫరా నిలిపివేశారు. దీంతో నీరు లేక విద్యార్థులు ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ విధంగా తమ పై ఒత్తిడి తెస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.” మా క్యాంపస్ ఎస్పీ కంట్రోల్లో ఉంది.. తాగునీరు, విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించాలి. అని విద్యార్థులు ట్వీట్ చేశారు.