తెలంగాణ అంటే స్లోగన్ కాదు.. అది ఆత్మ గౌరవ నినాదం – తమిళి సై

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొన్న గవర్నర్ తమిళ సై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంటే స్లోగన్ కాదని.. అది ఆత్మ గౌరవ నినాదం అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అమరవీరులను స్మరిస్తూ బావోద్వేగం తో గవర్నర్ తమిళ సై ప్రసంగించారు.

మొత్తం ప్రసంగాన్ని తెలుగులో మాట్లాడిన తమిళ సై… అనేక పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణకు గవర్నర్ గా రావడం దేవుని ఆశీర్వాదం అన్నారు. ఆధునిక ప్రపంచంలో తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని.. తెలంగాణ అమరవీరుల కు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

స్వరాష్ట్ర ఏర్పాటులో బాగంగా తనువు చాలించిన వారి పేర్లను స్మరించుకోవడం నా అదృష్టం అని వెల్లడించారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్టం అన్నిట్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నానని.. నాకు చాలా ఆనందంగా ఉంది..ఇవాళ 1969 తెలంగాణ ఉద్యమ కారులను కలిశానని చెప్పారు. హైదరాబాద్ అంతర్జాతీయంగా పేరు సంపాదించిందని.. కేవలం ఒక్క చోటే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృధి జరుగుతునే అభివృధి జరిగినట్లు అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version