నేడు అసెంబ్లీలో సాగునీటి శాఖపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చ పెట్టాలని కాంగ్రెస్ భావించినట్లు సమాచారం. కాలేశ్వరంలో అవినీతిపై కాగ్ నివేదిక, మేడిగడ్డ సహా వివిధ ప్రాజెక్టుల్లో నిర్మాణ లోపాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మద్యంతర నివేదికను శ్వేత పత్రంలో పొందుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అటు గృహజ్యోతి పథకం అమల్లో భాగంగా ఇళ్లకు ఉచితంగా కరెంటు సరాఫరా చేసే స్కీమ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి కరెంట్ కనెక్షన్ ఎవరి పేరుతో ఉందో వారి ఆధార్ ను సిబ్బందికి అందించాలని కోరింది. ఆధార్ లేకపోతే తక్షణమే అప్లై చేసుకుని, దాని వివరాలు అందించాలంది. ఆధార్ రానివారు బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, కిసాన్ పాస్ బుక్ ఇచ్చి పేర్లు నమోదు చేసుకోవాలంది.