ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపు నిచ్చారు. తెలంగాణ బంద్‌కు పిలుపు నిచ్చారు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలు తీర్చడంలో విఫలమైన రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలపడంలో భాగంగా ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపు నిచ్చారు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ ఈ బంద్‌లో పాల్గొంటున్నారు.
ఇక అటు DSC వాయిదా వేయాలంటు గాంధీ హాస్పిటల్ వద్దకు వచ్చిన నిరుద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని ఓయూలో నిరుద్యోగులు నిరసనకు దిగారు. గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని… గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి… 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలిని నిరుద్యోగులు డిమాండ్ చేస్తు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ హామీల సాధన కోసం ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపు నిచ్చారు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్.