పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలోని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పటాన్ చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు పనులు ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది కేసీఆర్‌ ప్రభుత్వం.

ఇందులో భాగంగానే…ఈ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.184.87 కోట్లను మంజూరు చేస్తూ జీవో నంబర్ 87 జారీ చేసింది సర్కార్‌. పటాన్ చెరులో ఐదెకరాల స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నారు అధికారులు.

ఆసుపత్రి నిర్మాణ పనులను రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కు అప్పగించారు అధికారులు. త్వరలోనే ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది. ఈ ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్‌ రావు.. రానున్నారు.