ఇవాళ సెలవు ప్రకటించడం..తెలంగాణను అవమానించినట్లే – బండి సంజయ్

-

ఇవాళ సెలవు ప్రకటించడం..తెలంగాణను అవమానించినట్లేనని బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు.. జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. అనేక మంది బలిదానాలు, సర్ధార్ పటేల్ కృషి ఫలితంగా తెలంగాణ దేశంలో విలీనం అయింది..ఎన్నో ఏళ్ళ తరువాత అధికారికంగా ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు.

దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత తెలంగాణకు వచ్చింది.. నిజాం, రజాకార్ల చేతిలో తెలంగాణ ప్రజలు.. హిందువులు చిత్రహింసలకు గురయ్యారని తెలిపారు. తెలంగాణను పాకిస్థాన్ లో కలుపుతా లేదా ఒంటరి దేశంగా పెడ్తామన్నాడు నిజాం.. నిజాం ఒక తుగ్లక్.. అని పైర్‌ అయ్యారు. ఆపరేషన్ పోలో తో అన్ని సర్దుకుని నిజాం పారిపోయాడు.. అనేక మంది దేశ భక్తులు కాల్చి చంపబడ్డారన్నారు.

అర్థం పర్థం లేకుండా పోటీగా రాష్ట్రం సమైక్యత దినోత్సవాలు నిర్వహిస్తుంది.. ఇన్ని రోజులు ఎందుకు వేడుకలు జరపలేదన్నారు. ఇన్ని రోజులు లేంది ఇప్పుడు ఎందుకు జరుపుతున్నావో సమాధానం చెప్పు కేసీఆర్.. ప్రభుత్వ కార్యాలయాలకు.. స్కూల్స్ కి సెలవు ప్రకటించడం అవమానించడమేనన్నారు. సెలవు ఇవ్వకుండా వేడుకలు నిర్వహించమని ఆదేశాలు ఎందుకు ఇవ్వలేవని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news