కార్గో సేవలపై తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

-

కార్గో సేవలపై తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కార్గో సేవలో బార్కోడింగ్ విధానం అమలు చేయాలని టిఎస్ఆర్టిసి నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కింద కరీంనగర్, సికింద్రాబాద్ బస్టాండ్లలో ఉన్న కార్గో బుకింగ్ కేంద్రాల్లో తోలుత అమలు చేయనున్నారు. ఇందుకు బుకింగ్ కేంద్రాల్లోని కంప్యూటర్లలో సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేస్తున్నారు. ప్రస్తుతం పార్సిల్లు బుక్ చేసినచోట, చేరిన చోట ఆన్లైన్ లో వివరాలు నమోదు చేయాల్సి వస్తుంది.

Telangana RTC’s key decision on cargo services

తప్పుడు వివరాలు నమోదు అయితే… అప్పుడప్పుడు పార్సిల్ చేరాల్సిన ప్రాంతానికి కాకుండా వేరే చోటికి వెళ్తున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి బార్కోడింగ్ విధానం అందుబాటులోకి తెస్తున్నారు. దీనివల్ల బుక్ చేసినచోట ఆన్లైన్ లో వివరాలు నమోదు చేస్తే చాలు. చేరిన చోట నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ బార్ కోడ్ ను స్కాన్ చేస్తే వివరాలు తెలిసిపోతాయి. మరోవైపు పాత విధానంలో సెల్ఫోన్ లో టీవీలు, బల్బులు లాంటివి ఏవి పంపిన ఎలక్ట్రానిక్ వస్తువు అనే నమోదు చేసేవారు. తాజా విధానంలో ఏ వస్తువు స్పష్టంగా తెలిసిపోతుంది. తద్వారా మరింత జాగ్రత్తగా తీసుకెళ్లే వీలుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version