తెలంగాణలో రానున్న మూడు రోజులూ మండుటెండలు

-

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న మూడు రోజులు ఎండలు మరింత మండనున్నాయి. శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది.

దేశంలోని వాయవ్య, పశ్చిమ దిశల నుంచి దిగువ స్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండటంతోపాటు పొడి వాతావరణం నెలకొనడమే దీనికి కారణం. గరిష్ఠంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. మరోవైపు జూన్‌ ఒకటో తేదీ నుంచి అయిదు రోజులపాటు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను కూడా తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకూడదని సూచనలు చేసింది. వీలైనంతగా నీళ్లు తాగుతూ శరీరం డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్త పడాలని చెప్పింది.

శుక్రవారం నల్గొండ జిల్లా దామరచర్లలో గరిష్ఠంగా 44.3 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. మరోవైపు కరీంనగర్‌లోని భరత్‌నగర్‌ ప్రాంతంలో కానిస్టేబుల్‌ తంగేల్ల మధుకుమార్‌(41), ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం తులిస్యాతండాలో ఉపాధి కూలీ వాంకుడోతు సునీత(40) వడదెబ్బతో మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version