టీచర్ల ఆస్తి ప్రకటన జీవోపై వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కార్‌

-

హైదరాబాద్‌: టీచర్ల ఆస్తి ప్రకటనపై జీవో ను నిలిపివేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు మంత్రి సబిత ప్రకటన చేశారు. టీచర్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. అంతకు ముందు… ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

ప్రభుత్వ టీచర్లు స్థిర, ఛర భూములు కొన్నా, అమ్మినా అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. టీచర్లు తమ పేరిట ఉన్న ఆస్తులు, కుటుంబ సభ్యుల పేరిట భవనాలు, ఇళ్ల స్థలాలు, వాణిజ్య స్థలాలు, వ్యవసాయ భూములు ఇలా వాటి వివరాలను మార్కెట్ ధర ప్రకారం వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంటూ జీవో జారీ చేసింది. స్థిరచరాస్తులు తో కూడిన వివరాల నివేదికను ప్రైమరీ టీచర్లు అయితే హెడ్మాస్టర్ లకు, హై స్కూల్ టీచర్లు అయితే ఎంఈఓ లకు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే.. తాజాగా టీచర్ల ఆస్తి ప్రకటనపై జీవో ను నిలిపివేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news