కేంద్రంలో అసమర్థ ప్రభుత్వం ఉంది – మంత్రి కేటీఆర్

-

కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు మంత్రి కేటీఆర్. పునర్విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీ నెరవేర్చ లేదని మండిపడ్డారు. కేంద్రంలో ఓ అసమర్ధ ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశ పెట్టె చివరి బడ్జెట్ లోనైన తెలంగాణకు ఇచ్చిన హామీ లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

సబ్ కా సాత్ సబ్ కుచ్ బాక్ వాస్ గా చేశారని వ్యాఖ్యానించారు. ఒక్క పైసా అదనంగా కేంద్రం తెలంగాణకు ఇవ్వలేదని ఆరోపించారు మంత్రి కేటీఆర్. తాను చెప్పింది తప్పు ఐతే.. రాజీనామాకు సిద్ధం అని సవాల్ విసిరారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ లో ఉన్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా ? అని బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news