ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ కు మంత్రి కేటీఆర్ ఇచ్చిన రియాక్షన్ వీడియో వైరల్ అవుతుంది. ఓ కార్యక్రమంలో కేటిఆర్ ప్రసంగిస్తుండగా… అక్కడున్న మొబైల్స్ కు ఒక్కసారిగా బీప్ సౌండ్ అలర్ట్ వచ్చింది. దీంతో ‘ఇది ఫైర్ అలారమేనా. మనం అందరం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలా? నాకు తెలిసి ఇది ఫైర్ అలారమే’ అని ఆయన చెప్పారు. స్పీకర్ సౌండ్ అని ఓ వ్యక్తి చెప్పగా…’క్లోజ్డ్ ఆడిటోరియంలో ఉన్నాం గుడ్ లాక్ గాయ్స్’ అని కేటీఆర్ నవ్వులు పూయించారు.
ఇది ఇలా ఉండగా, మీ ఫోనుకు ఎమర్జెన్సీ అలర్ట్ వస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మందికి మొబైల్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందో తెలియక అందరూ గందరగోళానికి గురయ్యారు. అయితే, దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపిందట. కానీ, అందులో భయపడాల్సేందేమీ లేదు. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగా ఈ మెసేజ్ వచ్చినట్లు తెలిసింది.