బక్రీద్ సందర్భంగా గురువారం రోజున హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు దీనికి సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
- పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారు బహదూర్‌పురా ఎక్స్ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల మధ్య ఈ రూట్లలో అనుమతిస్తారు.
- శివరాంపల్లి, ధనమ్మ హట్స్ వైపు నుంచి ప్రార్థనల కోసం వచ్చే అన్ని వాహనాలను ధనమ్మ హట్స్ రోడ్డు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు.
- ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్, రాజేంద్రనగర్ వైపు నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను అరాంఘర్ జంక్షన్ వద్ద నుంచి మళ్లిస్తారు.
- కాలాపత్తర్ నుంచి ఈద్గాకు వచ్చే వాహనాలను కాలాపత్తర్ ఠాణా వైపు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు.