టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజెపి పార్టీపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపిని టార్గెట్ చేస్తూ ఓ ఛార్జ్ షీట్ ని విడుదల చేశారు. 1. నీతి ఆయోగ్ చెప్పినా ఫ్లోరైడ్ నివారణకు నిధులు ఇవ్వలేదు, 2016లో నడ్డా చెప్పిన ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ఇవ్వలేదు, 2. చేనేతపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని మోడీ, నూలు సబ్సిడీ తగ్గింపు, ఖాదీ బోర్డ్ రద్దు, 3. వ్యవసాయ మీటర్లకు మీటర్లు, 4. నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం, 5. గ్యాస్ ధర పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు. వీటిపై చార్జి షీట్ విడుదల చేశారు మంత్రి కేటీఆర్.
ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టలో ప్రమాణం చేసిన విషయంపై కేటీఆర్ స్పందిస్తూ.. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారం అయితే కోర్టులు, చట్టాలు అవసరం లేదన్నారు. రేపిస్టులను సన్మానించిన చరిత్ర బిజెపిదని.. అలాంటి వాళ్ళ ప్రమాణాలకు విలువ ఏముంటుందని అన్నారు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో దేవుడిని తాకడం అంటే పాపం అని అన్నారు. దయచేసి సంప్రోక్షణ చేయాలని వేద పండితులను కోరుతున్నానని అన్నారు మంత్రి కేటీఆర్.