ఇవాళ మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలతో.. బండి సంజయ్ తన ఐదో విడద పాదయాత్రను వాయిదా వేసుకోగా.. ఎల్లుండి జరుగాల్సిన టీఆర్ఎస్ సమావేశం వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు.
కానీ.. దీనిపై స్వయంగా సీఎం కేసీఆర్ స్పందించారు. ఎల్లుండి యథావిథిగా టీఆర్ఎస్ సమావేశం జరుగుతుందని కుండ బద్దలు కొట్టి చెప్పారు సీఎం కేసీఆర్. ఎల్లుండి ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం, ఉప ఎన్నిక షెడ్యూల్తో సంబంధం లేదని పేర్కొన్నారు కేసీఆర్.
కాగా.. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది..ఈ నెల 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండగా, నవంబర్ 3న ఎన్నిక జరగనుంది..నవంబర్ 6న ఫలితం వెలువడనుంది. అంటే సరిగ్గా చూసుకుంటే ఒక నెలలో మొత్తం ప్రక్రియ పూర్తి అయిపోతుంది.