వైకుంఠ రథంపై భగవద్గీత పెట్టొద్దా..మరేం ఏ పాటలు పెట్టాలి – బండి సంజయ్‌ పై VH ఫైర్‌

వైకుంఠ రథంపై భగవద్గీత పెట్టొద్దా..మరేం ఏ పాటలు పెట్టాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ పై VH ఫైర్‌ అయ్యారు. నిన్న జనగామాలో వైకుంఠ రథంపై భగవద్గీత పెట్టొద్దని బండి సంజయ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అయితే.. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు వీహెచ్‌. వైకుంఠ రథంపై భగవద్గీత పెట్టొద్దనడం మంచి పద్దతి కాదు.. ఇలాంటి ప్రెసిడెంట్ ను ఎట్లా పెట్టావు రా బాబు అని నరేంద్ర మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి మాటలు చూస్తే… భవిష్యత్తు తరాలు.. రాజకీయ నాయకులను అసహ్యానిచుకునే పరిస్థితి ఉంటుందని చురకలు అంటించారు. ఏం ఘనకార్యం చేశాడు అని పాదయాత్ర చేస్తున్నాడని బండి సంజయ్‌ పై మండిపడ్డారు. . పార్టీ లో అంతర్గత అంశాలపై అధిష్టానం పిలిచి మాట్లాడాలి.. అందరికీ కాంగ్రెస్ అధికారం లోకి రావాలని ఉందన్నారు. మర్రి శశిధర్ రెడ్డి అవేదన చెప్పాడు… దాన్ని అధిష్టానం సరిదిద్దాలని కోరారు. నన్ను కూడా గతంలో తిట్టారు.. అవమాన పరిచారు.. హైకమాండ్ ఆలోచనా చేయాలని కోరారు వీహెచ్‌.