సినిమా ఇండస్ట్రీ పై విజయశాంతి సంచలన పోస్ట్ చేశారు. తనను సినిమా ఇండస్ట్రీ లో తొక్కేసారనే మీనింగ్ వచ్చేలా పోస్ట్ పెట్టారు రాములమ్మ. సినిమా, క్రికెట్ ఒకలాగే ఉంటాయి …..ఎట్లంటే ప్లేయర్ విజయం సాధించినా, టీమ్ గెల్వదు క్రికెట్ లా ఒక్కొక్కసారి అంటూ వెల్లడించారు. కానీ, ప్రజలు అభిమానించిన సినిమా కళాకారులు ఎవ్వరైనా సినిమా జయాపజయాలకు నిమిత్తం లేకుండా, తమ తప్పు లేకుండా వారి బాధ్యత వరకు విజయవంతమవటం ఎన్నో సినిమాలలో ప్రేక్షకులకు అవగతమే అని చెప్పారు.
ఒక్క సినిమా ఏదో తప్పు వల్ల విజయం సాధించకపోతే, దశాబ్దాల విజయాలను పరిగణించక కళాకారులను ఏదో ఒక విధంగా ట్రోలింగ్ చెయ్యడం అసమంజసం అన్నారు రాములమ్మ. అమితాబ్ గారు, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు… ఎవ్వరైనా ఆ ప్రామాణికత నిలబెట్టుకున్నవారే, తమ ప్రయత్న, ప్రయాసల దృష్ట్యా…కాదంటే, ఇన్ని సినిమాలు చెయ్యడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు.
180 సినిమాలు చేసిన నాకు, ఒక కళాకారిణిగా నా నటనా ప్రయాణం, చేసిన అనేకమైన సినిమాలకు ప్రజల ఆదరణ ఒక వైపు, నచ్చి చేసిన కొన్ని పాత్రలకు ఎప్పుడైనా ఒక్కొక్కసారి (తక్కువ సందర్భాలలోనే ఐనా కూడా) అనుకున్న గుర్తింపు దక్కలేదేమో అన్న భావం మరి కొన్ని సినిమాలకు అనిపిస్తదన్నారు. లెజెండ్ రాజ్‌కపూర్ గారు ఎన్నడో చెప్పినట్లు, సరిగా ప్రేక్షకుల దగ్గరకు, విజయాలకు చేరని, కళాకారులం అభిమానించి చేసిన పాత్రలు ఎన్నడైనా నటీ నటులకు వారి బ్లెస్డ్ చిల్డ్రన్ లాంటివి…ప్రత్యేకంగా ఆదరణీయ మైనవి…అంతే అన్నారు విజయశాంతి.