తెలంగాణ రాష్ట్రంలోని వీఆర్ఏలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. తాజాగా మెట్రో భవన్ లో మంత్రి కేటీఆర్ ను తెలంగాణ వీఆర్ఏలు కలిసారు. ఈ నెల 13న అసెంబ్లీ లో ఇచ్చిన హామీ మేరకు కేటీఆర్ తో సమావేశమైయ్యారు గ్రామ రెవెన్యూ సహాయకులు.
తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించారంటున్న వీఆర్ఏలు… మెట్రో భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిశారు. రాబోయే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వీఆర్ఏలతో ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పినట్టు సమాచారం అందుతోంది.
మూడు డిమాండ్లు పే స్కేల్, 55 ఏళ్ళు పైబడిన వారికి సర్వీస్ పెన్షన్, కారుణ్య నియామకాలపై కేటీఆర్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. వీటిపై వచ్చే కేబినెట్ సమావేశంలోనే సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం అందుతుంది. వీఆర్ఏల నుంచి తెలంగాణ ప్రభుత్వం పై వ్యతిరేకత రావడంతో… దానిని సానుకూలంగా మలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది కేసీఆర్ సర్కారు.