తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి ఆవర్తనం ఈ రోజు కూడా ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు పరిసర ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉంది.
దీంతో రాగల 3 రోజులు వర్షాలు ఉన్నాయి. ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, సిద్దిపేట జిలాల్లో భారీ వర్షం పడింది. ఏఏ ప్రాంతాల్లో వర్షపాతం ఎంత నమోదు అయిందో ఇప్పుడు చూద్దాం.
వికారాబాద్ లో 12.6 cm,
యాదాద్రి జిల్లా భువనగిరి 10.8 cm
సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ లో 10.6 cm
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ 10.5 cm
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 9.7cm
హైదరాబాద్ జిల్లా మలక్ పేటలో 8.9cm
సైదాబాద్ కూర్మగుడాలో 8.8cm
బహదూర్ పుర 8.7cm
సిద్దిపేట కోమరవేల్లిలో 8.6cm
ఛార్మినార్ 8.5cm
నారాయణగూడ 8.5 cm