బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ 21వ తేదీన జరిగింది. ఈ నేపథ్యంలోనే.. YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలో ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని.. అసలు ప్రజల్లో ఏ ఆదరణ లేని బీజేపీ,కాంగ్రెస్ లు బరిలో ఉన్నాయని ఆగ్రహించారు. మునుగోడులో ఆగం జేయొద్దని కేసీఆర్ వంగి వంగి దండాలు పెడుతున్నాడు. ఇదో కొత్త వేషం. ఊసరవెళ్లికే పాఠాలు నేర్పే వ్యక్తి కేసీఆర్. ఎలాంటి ఆదరణ లేని కాంగ్రెస్, బీజేపీకే భయపడుతున్నాడంటే. మా పార్టీ బరిలోకి దిగితే ప్రజల కాళ్లు మొక్కుతాడేమో అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు.