చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను ధ్వంసం !

-

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నియోజక వర్గం అయిన కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేశారు వైసీపీ పార్టీ కార్యకర్తలు. అక్కడితో ఆగకుండా.. టీడీపీ నేతల ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు వైసీపీ నేతలు.

కుప్పంలో ఆందోళనకు దిగిన వైసీపీ నేతలు.. మొదట ఎమ్మెల్సీ భరత్ ఇంటి నుండి బయలుదేరి.. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేశారు. అటు ఇవాళ రెండోరోజు చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు భారీగా తరలివచ్చారు.

దీంతో కుప్పంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానార్లను ధ్వంసం చేసిన వైసీపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. ఇది ఇలా ఉండగా.. కాసేపటి క్రితమే కుప్పంలో ర్యాలీగా బయలుదేరారు టీడీపీ నేతలు. ఈ ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. జై జై బాబు అంటూ నినాదాలు చేస్తూ.. ర్యాలీలు తీస్తున్నారు టీడీపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news