పనితీరుకు నిదర్శనం YSR, అవినీతికి నిదర్శనం kcr – వైయస్ షర్మిల

కాలేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై వేల కోట్లు ఖర్చు చేసి కట్టిన కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్ లు ఇటీవల వచ్చిన వరదల్లో మునిగిపోయాయి. 29 బాహుబలి మోటర్లు ఇంకా నీళ్ల కిందే ఉన్నాయి. అయితే తాము బాగానే కట్టామని,కానీ గత రెండు వందల ఏళ్లలో గోదావరికి ఎన్నడూ రానంత వరదలు రావడం వల్లే మునిగిపోయాయి అని రాష్ట్ర ప్రభుత్వం, ఇంజనీర్లు ప్రచారం చేస్తున్నారు.

కానీ ఇదే గోదావరిపై 18 ఏళ్ల కిందటి అప్పటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల గ్రామం దగ్గర నిర్మించిన పంపు హౌస్ మాత్రం ఇటీవల గోదావరి వరద కి మునగ లేదు.ఇదే విషయాన్ని లేవనెత్తుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేసీఆర్ పై మండిపడ్డారు.

” 18 ఏళ్ల కింద వైయస్సార్ గారు కట్టిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ చెక్కుచెదరకుండా పని చేస్తుంటే, లక్షల కోట్లు అప్పు తెచ్చి మరీ కెసిఆర్ కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు లోని కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్ లు పట్టుమని రెండేళ్లు కూడా కాకుండానే మునిగి పోయాయి. సమర్ధత గల నాయకుని పనితీరుకు నిదర్శనం వైయస్సార్ దేవాదుల, అనవసరమైన ఖర్చుకు, అవినీతికి నిదర్శనం కేసీఆర్ కాలేశ్వరం”. అంటూ ట్వీట్ చేశారు.