దిల్ రాజు చేతుల మీదుగా ‘తెలుసా మనసా’ ఫస్టులుక్ పోస్టర్

-

వర్ష – మాధవి నిర్మించిన చిత్రం ‘తెలుసా మనసా’ ఫస్టులుక్ పోస్టర్ ను కొంతసేపటి క్రితం దిల్ రాజు చేతుల మీదుగా విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులు ప్రేమకథలను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. మంచి ఫీల్ వర్కౌట్ చేస్తే భారీ హిట్ ను తీసుకొచ్చి మేకర్స్ దోసిట్లో పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కంటెంట్ కనెక్ట్ అయితే చాలు .. బడ్జెట్ ను కూడా పట్టించుకోకుండా భారీ వసూళ్లను అందిస్తారు. అలాంటి ప్రేమకథల్లో ఒకటిగా ‘తెలుసా మనసా’ సినిమా రూపొందింది. పార్వతీశం – జశ్విక జంటగా నటించిన ఈ సినిమాను వర్ష – మాధవి నిర్మించారు.

గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, వైభవ్ దర్శకత్వం వహించాడు. ఇది ఒక స్వచ్ఛమైన .. ప్రతిఫలాపేక్షలేని ప్రేమకథ అంటూ మేకర్స్ మరింత ఆసక్తిని పెంచారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి దిల్ రాజు చేతుల మీదుగా ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. రోహిణి హట్టంగిడి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో ఫ్యామిలీ ఏదో విషయంపై ఆలోచిస్తూ దిగాలుగా కూర్చోవడం ఈ పోస్టర్లో కనిపిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version