మునుగోడు పోరు.. కారు-కమలంలో కొత్త టెన్షన్..!

-

మునుగోడు ఉపఎన్నికలో గెలవడం అనేది మూడు ప్రధాన పార్టీలకు చావో-రేవో అనే పరిస్తితి ఉంది. టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీలకు మునుగోడులో గెలుపు అనేది చాలా ముఖ్యం. ఇందులో గాని ఓడితే..ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై గట్టిగా పడుతుంది. అయితే ఇక్కడ కాస్త కాంగ్రెస్ సేఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగింది..ఏ ఎన్నికలోనూ గెలవలేదు. కాబట్టి ఇక్కడ ఓడిన సరే కాంగ్రెస్‌కు ఇంకా పెద్ద డ్యామేజ్ ఏం జరగదు.

ఒకవేళ ఇక్కడ గెలవకపోయినా ఓట్లు బాగా తెచ్చుకుంటే చాలు కాంగ్రెస్‌కు. కానీ టీఆర్ఎస్-బీజేపీల పరిస్తితి అది కాదు. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్తితి. రాష్ట్రంలో ఎలాగో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు పోరు జరుగుతుంది. పైగా ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికల్లో రెండు టీఆర్ఎస్, రెండు బీజేపీ గెలుచుకున్నాయి. ఇప్పుడు మునుగోడులో సైతం గెలిచి తీరాలని పనిచేస్తున్నాయి. ఈ ఎన్నికలో ఏ పార్టీ ఓడినా..ఆ పార్టీకి రాజకీయంగా కాస్త నష్టం జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది.

అధికార టీఆర్ఎస్ గాని ఓడితే..ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై బాగా పడుతుంది..పైగా టీఆర్ఎస్‌పై ప్రజల్లో నమ్మకం తగ్గుతుంది. అదే సమయంలో మునుగోడులో పార్టీని గెలిపించడానికి తిరుగుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రభావం ఉంటుంది..మునుగోడుని 86 యూనిట్లగా విభజించి..వాటికి ఎమ్మెల్యేలు, మంత్రులని ఇంచార్జ్‌లుగా పెట్టారు. వారి యూనిట్లలో తక్కువ ఓట్లు తెచ్చుకుంటే ఆ నేతలకు ఇమేజ్‌కు రిస్క్.

ఇటు బీజేపీ పరిస్తితి కూడా దాదాపు అంతే..వరుసగా దుబ్బాక, హుజూరాబాద్ గెలిచి ఉంది..ఈ మునుగోడులో కూడా గెలిస్తే ఇబ్బంది లేదు..అలా కాకుండా ఓడిపోతే..బీజేపీకి రాజకీయంగా చాలా నష్టం. ఆ పార్టీలో చేరికలు కూడా తగ్గిపోతాయి. ఇప్పటివరకు బీజేపీ వాపుని చూసుకుని బలుపు అనుకుందననేది హైలైట్ అవుతుంది. ఎటు తిప్పి చూసుకున్న మునుగోడులో గెలుపు అనేది టీఆర్ఎస్-బీజేపీలకు చాలా ముఖ్యమని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version