కొంపముంచిన మేకప్‌.. వధువు మొఖం పాడైందని పెళ్లి క్యాన్సిల్‌ చేసేసిన వరుడు

-

ఒక వ్యక్తి లైఫ్‌లో పెద్ద మార్పు తేచ్చేది పెళ్లి మాత్రమే… అది అమ్మాయికి అయినా, అబ్బాయికి అయినా.. పెళ్లి జరిగిందంటే.. ఏదీ మునపటిలా ఉండదు..అంతా కొత్తగా ఉంటుంది.. కొత్త మనుషులతో అడ్జెట్స్‌ అయి బతకాలి.. అసలు ఇవన్నీ కాదు.. ముందు పెళ్లి ఫిక్స్‌ అయినప్పటి నుంచి పెళ్లి జరిగే వరకూ చాలా గండాలు ఉంటాయి.. ఎక్కడ ఎవరికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు.. కొన్ని సార్లు చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానలా అవుతాయి.. అవి కాస్త పెళ్లి ఆగిపోయే వరకూ వెళ్తాయి.. పాత మంచం ఇచ్చారని పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న వరుడు, చీప్‌ లెహంగా పంపారని పెళ్లికి నో చెప్పేసిన వధువు ఇలాంటి ఘటనలు ఈ మధ్యనే జరిగాయి.. ఇది కూడా అలాంటిదే..పెళ్లి కూతురు మేకప్‌ పాడైందని మనోడు మ్యారేజ్‌ వద్దన్నాడట..పాపం మేకప్‌వేసుకోవడమే ఆమె కొంపముచ్చింది.. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
కర్ణాటకలో హసన్‌ జిల్లాలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పెళ్లిలో మరింత అందంగా కన్పించాలని మేకప్ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్లిన నవ వధువుపై అక్కడ బ్యూటీ పార్లర్ యజమాని చేసిన ఓ ప్రయోగం బెడిసికొట్టింది. ఉన్న ముఖం కాస్తా అంద వికారంగా మారింది. దీంతో వరుడు ఈ అమ్మాయి తనకు వద్దు అంటూ పెళ్లిని రద్దు చేసుకున్నాడు. హసన్‌ జిల్లా అరసికరె గ్రామానికి చెందిన ఓ యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. వివాహ తేదీ దగ్గర పడుతుండటంతో 10 రోజుల క్రితం ఆ అమ్మాయి దగ్గర్లోని బ్యూటీ పార్లర్‌‌కు వెళ్లింది. అక్కడ పనిచేస్తున్న ఓ బ్యూటీషియన్‌.. కొత్త రకమైన మేకప్‌ వేస్తానని ఆ అమ్మాయికి చెప్పింది. అయితే ముందు ముఖానికి ఫౌండేషన్‌ రాసి ఆ తర్వాత ఆవిరి పట్టింది. ఇది కాస్తా బెడిసికొట్టి ఆ అమ్మాయి ముఖం కాలిపోయి బొబ్బలెక్కింది. అంతేకాదు యువతి ముఖం కూడా మారిపోయింది.
దీంతో ఆమె ముఖంపై గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు…ప్రస్తుతం ఆ యువతి ఐసీయూలో చికిత్స పొందుతోంది. అలెర్జీ కారణంగా బాధిత యువతికి ఇలాంటి పరిస్థితి ఎదురైందని వైద్యులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ బ్యూటీషియన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ పరిణామాలతో ఆ అమ్మాయి పెళ్లిని తొలుత వాయిదా వేశారు. అయితే, వధువు ముఖ పరిస్థితి గురించి తెలుసుకున్న ఆ వరుడు తనకీ పెళ్లి వద్దంటూ రద్దు చేసుకున్నాడు.
అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి అంటే ఇదేనేమో..ఏది ఏమైనా ముఖానికి ఏదైనా కొత్త ప్రయోగాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి..ముఖ్యంగా ఇలాంటి ఫంక్షన్స్‌ ఉన్నప్పుడు అసలే చేయకూడదు..!

Read more RELATED
Recommended to you

Latest news