ఆపదలో ఉన్న ఏనుగుని కాపాడిన అమ్మాయి.. ఆశీర్వదించిన గజరాజు..!!

-

ఏనుగులు చూడాలని అందరూ అనుకుంటారు కానీ..అవి నిజంగా కనిపిస్తే..పరుగెత్తడం తప్ప ఏం చేయలేం..తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ ఏనుగులు సంచారం ఉంది..అవి పొలాల మీద దాడి చేసి పంటను ధ్వంసం చేస్తుంటాయి. సరే ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఒక ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. గజేంద్రమోక్షంలో ప్రమాదంలో ఉన్న మొసలిని ఏనుగు కాపాడినట్లు.. ఇక్కడ ఏనుగు ప్రమాదంలో ఉంటే.. ఓ అమ్మాయి కాపాడింది.. దానికి రివర్స్‌లో ఏనుగు ఏం చేసిందో తెలుసా..!
ఒక చెరుకు పొలానికీ, రోడ్డుకీ మధ్య బురదలో ఏనుగు కాళ్లు చిక్కుకుపోయాయి. అది చూసిన ఓ అమ్మాయి ఏనుగు దగ్గరికి వెళ్లి గజరాజు కాళ్ళని బయటకు తీసేందుకు తెగ ప్రయత్నించింది. కానీ ఆమెకు అంత బలం లేదు. ఆ ఏనుగు దాడి చేస్తుందేమో అనే భయం లోలోపల ఉన్నా.. మంచి మనసుతో ఆ అమ్మాయి.. ప్రాణాలకు తెగించింది. ఆమె తాలూకు వాళ్లు.. జాగ్రత్త అని చెబుతున్నా.. ఆమె వెనక్కి తగ్గకుండా.. ఏనుగును కాపాడే ప్రయత్నం చేసింది. తన కోసం ఆమె పడుతున్న శ్రమను ఏనుగు గమనించింది. తను కూడా బురద నుంచి బయటకు వచ్చేందుకు గట్టిగా ప్రయత్నించింది. ఇలా రెండు వైపులా జరిగిన ప్రయత్నం ఫలించింది. వెంటనే ఆ ఏనుగు ఆమెకి థాంక్స్ చెబుతున్నట్లుగా.. తొండంతో ఆశీర్వదించింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పెంపుడు ఏనుగులు అయితేనే మనుషులు దగ్గరకు వచ్చినా ఏం అనవు.. అడివిలో తిరిగే ఏనుగులు అయితే..మనుషులను చూడగానే చిర్రత్తిపోయి..తొండెం పైకెత్తి గట్టిగా అరుస్తాయి.. కానీ ఇక్కడ ఏనుగు తనను కాపాడిన అమ్మాయిని గ్రహించి..కృతజ్ఞతలు చెప్పింది.. ఈ వీడియో చూస్తే భలే ఉంటుంది. నెటిజన్లు అయితే అమ్మాయిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోని IFS ఆఫీసర్ సుశాంత నందా.. తన ట్విట్టర్ అకౌంట్‌లో అక్టోబర్ 27, 2022న షేర్ చేశారు. చూసినవాళ్లంతా అమ్మయిని పొగుడుతుంటే..కొందరు మాత్రం వీడియో తీస్తున్న వ్యక్తి ఎందుకు వచ్చి సాయం చేయలేదు అంటూ కమెంట్ చేస్తున్నారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version