‘ ది కాశ్మీర్ ఫైల్స్’ తరువాత వివేక్ అగ్నిహోత్రి నెక్ట్ మూవీ ‘ ది ఢిల్లీ ఫైల్స్’

-

‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా కలిగించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. ఏకంగా రూ. 330 కోట్లను కొల్లగొట్టింది. 1990లో కాశ్మీర్ లో హిందువులు, పండిట్లపై జరిగిన మారణ హోమాన్ని తెరకెక్కించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ప్రధాని మోదీతో సహా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇతర బీజేపీ మంత్రులు ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను ప్రశంసించారు. ఏకంగా గుజరాత్, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు ఏకంగా సినిమాకు టాక్స్ ఫ్రిని ప్రకటించాయి. 

ఇదిలా ఉంటే దర్శకుడు వివేక్ అగ్నిహెత్రి తన నెక్ట్ సినిమాను కూడా ప్రకటించారు.  ‘ది కాశ్మీర్ ఫైల్స్’ కన్నా ముందు లాల్ బహదూర్ శాస్త్రి మరణం నేపథ్యంలో ‘ ది తాష్కెంట్ ఫైల్స్ ’ సినిమాను తీసిన వివేక్ అగ్నిహెత్రి ఇప్పుడు ది కాశ్మీర్ ఫైల్స్ తరువాత ‘ ది ఢిల్లీ ఫైల్స్’ తీస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాలుగు ఏళ్ల నిజాయితీకి చిత్తశుద్ధికి నిదర్శనం ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ అని… కాశ్మీరీ హిందువులపై మారణహోమాన్ని, అన్యాయాన్ని గురించి ప్రజలకు తెలయజేయడం చాలా ముఖ్యం అని.. ఇక కొత్త సినిమాకు పనిచేేసే సమయం వచ్చిందంటూ ట్వీట్ చేశారు వివేక్ అగ్నిహెత్రి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version