ఆ ఆలు ధర బంగారం కన్నా విలువైంది..ఎందుకో తెలుసా?

-

కూరగాయల రారాజు ఆలూ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..రుచి లో బెస్ట్..అంతేకాదు ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చునో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ఆలూ ధర మార్కెట్లో తక్కువగానే ఉంటుంది. సీజన్‌ను బట్టి రూ.5 నుండి రూ.35 వరకు ఉంటుంది.అయితే ఇతర కూరగాయలతో పోలిస్తే బంగాళదుంప ధర చాలా తక్కువగానే ఉంటుంది, కానీ, ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది అత్యంత ఖరీదైన ఒక రకమైన ఆలూ గురించి.

 

ఈ ఆలు ధర కిలో రూ.100 లేదా రూ.200ల రూపాయలో కాదు, కిలో ఆలుగడ్డ ధర రూ.50,000వేలు.. అంటే, మీరు ఒక కేజీ ఆలూ ధరతో తులం బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇక అంత్యంత ఖరీదైన కూరగాయల విషయానికి వస్తే, ఈ ఆలూ ఖచ్చితంగా ఆ జాబితాలో నెం.1 స్థానాన్ని ఆక్రమిస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు.ఈ అత్యంత ఖరీదైన ఆలూ పేరు లే బోనోట్. ఇది భారతదేశంలో కాకుండా ఫ్రాన్స్‌లో పండే బంగాళాదుంప జాతి. ఇది ఫ్రెంచ్ ద్వీపం ఐల్ డి నోయిర్‌మౌటియర్‌లో ప్రత్యేకంగా పెరుగుతుంది.

ఈ ఆలూ పండించడానికి ఒక ప్రత్యేక రకమైన ఇసుక నేలను ఉపయోగిస్తారు. దీనిని పెంచడానికి సముద్రపు పాచి ఎరువుగా ఉపయోగిస్తారు. లే బోనోట్ 50 చదరపు మీటర్ల భూమిలో మాత్రమే పెరుగుతుంది..అర కిలో 250 యూరోలు అంటే దాదాపు 22 వేల నుంచి 23 వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ ఆలూ ధర పెరుగుతూనే ఉంది. అయితే, ఇక్కడ మరో ఆశ్చరకర విషయం ఏంటంటే.. ఈ ఖరీదైన ఆలూ సంవత్సరానికి కేవలం10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఉప్పగా ఉండే ఆలూ తరచుగా ఇంట్లో సలాడ్లు,సూప్‌లను తయారు చేయడానికి వాడతారు..ఈ ఆలూ లో ఎన్నో పోషకాలు ఉండటం వల్ల అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version