వొళ్లు జలదరించే ఘటన: గుండెలను బయటకు తీసిన 76 మంది పిల్లల అస్తిపంజరాలు లభ్యం.. ఎక్కడో తెలుసా?

-

దక్షిణ అమెరికాలోని పెరూలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలకు ఒక భయానక అనుభవం ఎదురైంది. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం అంథ్రోపాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గాబ్రియేల్ ప్రిటో సారథ్యంలో పెరూలోని జో హువాంచకో సమీపంలోని పంపా లా క్రజ్ వద్ద తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాల్లో దాదాపు 76 మంది పిల్లల అస్తిపంజరాలు బయటపడ్డాయి. అయితే 76 మంది గుండెలను కూడా తీసినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.

చిన్నపిల్లలు-అస్తిపంజరాలు

ఎముకలను కత్తిరించి గుండెను బయటికి తీసినట్లు తెలుస్తోందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అస్తిపంజరాలను తూర్పు ముఖంగా ఖననం చేసినట్లు గుర్తించారు. కాగా, పంపా లా క్రూజ్‌లో చాలా ఏళ్లుగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 323 మంది చిన్నారుల అస్తిపంజరాలను గుర్తించారు. హువాంచసా సమీపంలో దాదాపు 1000కిపైగా అస్తిపంజరాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రిటో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version