పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాలో విలీనమవుతుంది అనే నమ్మకం ఉంది: రాజ్‌నాథ్ సింగ్

-

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమిత కశ్మీర్ ఇండియాలో విలీనమవుతుందనే విశ్వాసం తనకుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ప్రజలే ఇండియాలో కలిసేందుకు డిమాండ్ చేస్తున్నారు అని తెలిపారు. కాబట్టి అది జరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో కశ్మీర్ ప్రజల గురించి పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఇదివరకు చేసిన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు.

వాళ్లు కశ్మీర్‌ను ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా? వారు పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే ఆందోళన చెందుతున్నారు .కానీ, అది అవసరం లేదని నేను దాదాపు ఏడాదిన్నర క్రితమే చెప్పాను అని తెలిపారు. ఎందుకంటే పీఓకే ప్రజలే ఇండియాలో విలీనం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది’ అని ఆశా భావం వ్యక్తం చేశారు.తాము ఏ దేశంపైన కూడా దాడి చేసే ఆలోచనలో లేము. అయితే, పాక్ ఆక్రమించుకున్న కశ్మీర్ మనది, ఇండియాలో పీఓకే స్వయంగా విలీనం అవుతుందని నమ్ముతున్నానని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version