తల్లిదండ్రులు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని.. బాగా ఎదగాలని అనుకుంటారు. పిల్లలు హెల్తీగా ఉండాలన్నా.. వారు త్వరగా ఎదగాలన్నా ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ ఆహార పదార్థాలు వాళ్ళకి ఇవ్వాలి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కోడిగుడ్లు పిల్లలకి పెట్టాలి. గుడ్లు లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. రోజు ఒక కోడి గుడ్డుని ఉడికించి పిల్లలకు పెట్టడం వలన ప్రోటీన్ బాగా అందుతుంది. పిల్లల ఎదుగుదలకు ఇది తోడ్పడుతుంది. సోయాబీన్స్ ని పిల్లలకి ఇవ్వండి. సోయాబీన్స్ ఇస్తే కూడా ఆరోగ్యంగా ఉంటారు. సోయాబీన్స్ వలన ప్రోటీన్ బాగా అందుతుంది.
అలాగే వారి ఎదుగుదలకి సోయాబీన్స్ సహాయపడతాయి. ప్రతిరోజు పిల్లలకు పాలు, పాలు ఉత్పత్తులను ఇవ్వండి పాలు, పెరుగు, చీజ్, పన్నీర్ వంటి వాటిని పిల్లలకి ఇస్తే ప్రోటీన్ బాగా అందుతుంది. పిల్లలు బాగా ఎదగడానికి అవుతుంది. అలాగే పిల్లలకు చికెన్ ఇస్తూ ఉండండి. చికెన్ కూడా ప్రోటీన్ ని కలిగి ఉంటుంది. చికెన్ ని కూడా రెగ్యులర్ గా వాళ్ళకి పెట్టాలి.
ఆకుకూరలని పిల్లలకి ఇస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఆకుకూరల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకి ఆకుకూరలు ఇవ్వడం వలన బలంగా, దృఢంగా ఉంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి, పిల్లల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి క్యారెట్లు బాగా హెల్ప్ చేస్తాయి. క్యారెట్ లని కూడా రెగ్యులర్ గా పిల్లలకు ఇస్తూ ఉండండి. పండ్లు, తృణధాన్యాలు కూడా పిల్లలకు ఇవ్వాలి. అన్ని రకాల నట్స్ని కూడా మిక్స్ చేసి వాళ్లకు ఇస్తే ఆరోగ్యంగా ఉంటారు త్వరగా ఎదుగుతారు బరువు కూడా సరిగ్గా ఉంటుంది.