తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. శ్రీవారి లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. స్వామి వారి లడ్డుకు అంతటి పవిత్రత ఉంటుంది. దేశప్రధాని మొదలు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు ఎప్పుడూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుంటారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నుంచి తయారైన నెయ్యిని గత ప్రభుత్వం వినియోగించిందని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిడం స్వామి వారి భక్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేశ:లోని దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలి. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసిరావాలి. బోర్డు ఏర్పాటుపై చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు.