విదేశాలలో తీసిన తొలి తెలుగు సినిమా ఇదే..!

-

ఏదైనా సినిమా షూటింగ్ తీయాలి అంటే ఎక్కువగా ఈ మధ్యకాలంలో పలు ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. అయితే.. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఒక భారీ సెట్ వేసి అందులోనే పలు రకాలుగా ఉన్నట్లు చిత్రీకరిస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం VFX ఉపయోగించి పలు రకాలుగా కూడా తీస్తూ ఉంటారు. అయితే కొంతమంది డైరెక్టర్లు కూడా తమకు నాచురాలిటీ ఉండడం కోసం ఎక్కువగా వివిధ ప్రాంతాలలో తీస్తూ ఉంటారు . కానీ 45 ఏళ్ల క్రితం మాత్రం అమెరికాలో ఒక సినిమా షూటింగ్ చేసుకోవడం జరిగింది. అది కూడా ఒక తెలుగు చిత్రము. ఈ విషయం నిజంగానే సాహసమే అని చెప్పవచ్చు. ఇప్పుడు అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇక అప్పట్లోనే ఎంతో ఖర్చు పెట్టుకుని ధైర్యంగా ముందు అడుగు వేసి ఒక పాటలో కొన్ని సన్నివేశాలు మినహాయించి.. ఇక సినిమాలో మూడో వంతు భాగం అంత అమెరికాలోని చిత్రీకరించి శభాష్ అనిపించుకున్నారు నిర్మాత భరణి రెడ్డి. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ శ్రీధర్. ఇక ఆ సినిమా పేరు హరే కృష్ణ.. హలో రాధ.. ఈ చిత్రంలో హీరోగా కృష్ణ, శ్రీ ప్రియ జంటగా నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ అమెరికాలో తీయడానికి ఒక ముఖ్య కారణం ఉందట.

కృష్ణ.. డైరెక్టర్ శ్రీధర్ కు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉన్నది . అదేమిటంటే తేనె మనసులు సినిమా కంటే ముందు శ్రీధర్ నిర్మించే.. సినిమాలో హీరోగా తమిళంలో కృష్ణ పరిచయం కావాల్సి ఉండేది. అందులో భాగంగానే కొత్త వాళ్లతో నిర్మించాలనుకున్నారు శ్రీధర్. అందుచేతనే అందగాడుగా అనిపించే కృష్ణ హీరోగా ఎంపిక చేయడం జరిగింది. అయితే హీరో కృష్ణకు తమిళం రాదు. ఇక ఒక ట్యూటర్ని కూడా పెట్టారు అయితే తెలుగు చిత్రాలలో నటించాలి పేరు తెచ్చుకోవాలని కోరికతో ఉన్న కృష్ణకు తమిళం ఒక్క ముక్క కూడా బుర్రలోకి ఎక్కలేదు వారం రోజులు గడిచిన కృష్ణకు తమిళం ఏమాత్రం రావడం లేదు అని తెలిసి.. లాభం లేదనుకొని హీరో వేషానికి తమిళనాడు అయిన రవిచంద్రన్ ఎంపిక చేశారు శ్రీధర్. నటనకు అతడు కొత్తవాడే అయినా తమిళుడు కావడంతో ఇబ్బందేం పడలేదు. ఇక తమిళంలో కదలిక్క నెరమిళ్ళై అని చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయం సాధించింది.

అదే చిత్రాన్ని దర్శకనిర్మాత పీ.పుల్లయ్య ప్రేమించి చూడు తీశారు. ఇందులో అక్కినేని నటించడం గమనార్హం. అది జరిగిన 15 ఏళ్లకు హీరో కృష్ణ దర్శకుడు శ్రీధర్ కాంబినేషన్లో హరే కృష్ణ హలో రాధా చిత్రం రూపొందింది. కథను బట్టి అందరికన్నా డిఫరెంట్ గా ఏదైనా సాధించాలన్న కారణంతోనే మొదటిసారి అమెరికాలో ఈ సినిమా షూటింగ్ తీయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version