ఏపీ అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాల సందర్భంగా హోంమంత్రి అనిత వైసీపీ పార్టీ శ్రేణులు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చంద్రబాబు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరల అసెంబ్లీకి వచ్చారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం జగన్ బడ్జెట్ సమావేశాలకు రాకుండా ఎందుకు తప్పించుకుంటున్నారని ప్రశ్నించారు.
‘సింహం సింగిల్‌గా రావడం అంటే ఇదే’ నని చంద్రబాబు గారిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎమ్మెల్యేలను లాగేశావ్. బూతే సిగ్గుపడేలా బూతులు తిట్టించావ్, ప్రతిపక్ష నేతలను సస్పెండ్ చేయించావ్.అయినా చంద్రబాబు సాకులు చెప్పలేదు. ఒక్కడిగా వచ్చారు. అదీ ధైర్యం అంటే. ఎవరు సింహమో.. ఎవరు మేకవన్నెపులులో వేరే చెప్పాలా? ఎనీ డౌట్స్? అని చంద్రబాబు పాత ఫొటోను ట్వీట్ చేశారు.