ఏపీలో ఏ మంత్రులు ఏ శాఖకు సంబంధించి పనిచేస్తున్నారో ప్రజలకు తెలుసా? అంటే మెజారిటీ ప్రజలకు తెలియదు అనే చెప్పాలి. చాలామందికి మంత్రులు ఎవరో కూడా తెలియదు. ఏదో కొద్దిమందికి మాత్రం మంత్రులు ఎవరు అనేది ఐడియా ఉంది. కానీ ఎవరు ఏ శాఖ మంత్రి అనేది తెలియదు. ఏదో కాస్త రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికే ఈ అంశం తెలుసు. అయితే మంత్రులు శాఖలు ఏంటి అనేది తెలియకుండా ఉండటానికి కారణం.
మంత్రులు తమ శాఖకు సంబంధించి పనులు చేయడం, లేదా వాటి గురించి మీడియాతో చెప్పడం కంటే ప్రత్యర్ధులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లని తిట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో కొందరు మంత్రులు చంద్రబాబుని తిట్టడానికి, మరికొందరు పవన్‌ని తిట్టడానికి ఉన్నట్లు ఉన్నారు. అంటే కేవలం వారు మంత్రులుగా అదే పని చేస్తున్నట్లు ఉన్నారు.
అయితే పవన్ కోసం ఓ ముగ్గురు మంత్రులు ప్రత్యేకంగా ఉన్నారని, వారు పవన్‌ని తిట్టడం కోసమే మంత్రులుగా చేస్తున్నారని జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. కేవలం పవన్‌ని తిట్టడం కోసమే ఉన్న ఆ ముగ్గురు మంత్రులు ఎవరంటే గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, రోజా అని చెప్పి అంటున్నారు.
ఇక వీరు ఏ ఏ శాఖల బాధ్యతలు చూసుకుంటున్నారో ఎవరికి తెలియదని, కానీ పవన్‌పై విమర్శలు చేయడం కోసం మాత్రం వీరు పనిచేస్తున్నారని అంటున్నారు. ప్రతిరోజు మీడియా ముందుకు రావడం పవన్‌ని ఏదొకరకంగా విమర్శించడం చేస్తున్నారని చెబుతున్నారు. ఆఖరికి బస్సు యాత్రకు సిద్ధం చేసుకున్న బస్సు వారాహిని కూడా వారు వదలడం లేదంటే..వారు పవన్‌పై ఎంత ఫోకస్ చేశారో అర్ధం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. రోజా మీడియాలోకి వస్తే చాలు పవన్ లేదా బాబుపై విమర్శలు చేస్తారని, కానీ ఆమె శాఖకు సంబంధించి పనుల గురించి మీడియాతో చెప్పారని, దాని బట్టే అర్ధం చేసుకోవచ్చు మంత్రులు ఎలా పనిచేస్తున్నారో అని అంటున్నారు. మొత్తానికి మంత్రుల బాధ్యత..బాబు, పవన్‌ని తిట్టడానికే అన్నట్లు ఉంది.