ఆంధ్రలో వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం మూడు స్థానాలకు గాను ఏపీ నుంచి బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, సానా సతీష్‌లు నామినేషన్లు దాఖలు చేయగా ఏకగ్రీవం అయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ ముగ్గురిలో బీద మస్తాన్ రావు, సానా సతీశ్ టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వగా.. ఆర్.కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైనట్లు సమాచారం.కాగా, ఈ ముగ్గురు సభ్యులతో ఎన్డీయే కూటమికి రాజ్య సభలో సంపూర్ణ మెజారిటీ లభించనుంది. దీంతో కేంద్రం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఇక రాజ్యసభలో క్లియరెన్స్ వచ్చేందుకు లైన్ క్లియర్ అయినట్లే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.