మరో 2 రోజుల్లో మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలోని ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు ముగియనుంది. డ్రిగ్రీలో అడ్మిషన్స్ కోసం బాలికలు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు జూన్ 5న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల అధారంగా సీట్లు కేటాయిస్తారు.ఇంటర్‌లో చేరాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్స్‌లో 2021-22లో పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
అదేవిధంగా డిగ్రీలో చేరాలనుకునేవారు 2021-2022లో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యా్ర్థుల కుటుంబానికి సంవత్సర అదాయం గ్రామీణ ప్రాంతాలవారైతే రూ.లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలకు మించి ఉండరాదు. కాగా, బీసీ గురుకులాల్లో 6,7,8 తరగతుల్లో ప్రవేశాలకు జూన్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.