పసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా పెరుగుతూ పోయిన బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. జీవన కాల గరిష్టాల నుంచి కాస్త వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా, దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1900 డాలర్లకు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ అయితే 24 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇదే సమయంలో రూపాయి విలువ కూడా కాస్త మెరుగైంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.61 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నేపథ్యంలో వరుసగా బంగారం, వెండి ధరలు పెరుగుకుంటూ పోయాయి. దేశీయంగా కూడా రెండేళ్ల గరిష్టాన్ని మించి గోల్డ్, సిల్వర్ ట్రేడయ్యాయి.
ఇక దేశీయంగా చూస్తే బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరల్లో పతనం కనిపించింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ స్థిరంగా రూ.52,200 వద్ద కొనసాగుతోంది. ఇక ఇదే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.56,950 పలుకుతోంది. దేశరాజధాని దిల్లీలో కూడా బంగారం ధరలో ఎలాంటి మార్పూ లేదు. అక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రూ.52,350 వద్ద ఉండగా.. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,100కు చేరింది. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో గోల్డ్ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది.
హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.500 మేర తగ్గగా.. రూ.75,300కు చేరింది. అంతకుముందు రోజు ఏకంగా రూ.1800 పెరగడం తెలిసిందే. ఇక దిల్లీలో కూడా సిల్వర్ ధర పడిపోయింది. వరుసగా 6 రోజులు పెరిగిన తర్వాత తాజాగా కాస్త ఉపశమనం ఇచ్చింది. రూ.400 పడిపోయి ప్రస్తుతం కిలో వెండి రూ.72,500 వద్ద ట్రేడవుతోంది.