బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర నిలకడగా ఉంది. బంగారం ధర ఈరోజు నేలచూపులు చూసింది. హైదరాబాద్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 200 పడిపోవడంతో 10 గ్రాములకు రూ. 47,450కు క్షీణించింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రేటు అయితే రూ. 230 పడిపోయింది. దీంతో 10 గ్రాముల రేటు రూ. 51,760కు తగ్గింది. కాగా బంగారం ధరలు నిన్న పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి.
రెండు వారాలుగా గోల్డ్ రేటు పడిపోతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు 0.09 శాతం తగ్గుదలతో ఔన్స్‌కు 1828 డాలర్లకు క్షీణించింది. అయితే వెండి ధర మాత్రం పెరిగింది. 0.42 శాతం పైకి చేరింది. ఔన్స్‌కు 21.13 డాలర్ల వద్ద కదలాడుతోంది. మరోవైపు నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.66,000 అయింది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,760, 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.47,450 అయింది.