వెబ్‌సిరీస్‌ల‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు.. కొత్త ప్ర‌యోగం ఫ‌లిస్తుందా?

-

టాలీవుడ్ అగ్ర‌హీరోలు కొత్త పుంత‌లు తొక్కుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సిల్వ‌ర్ స్క్రీన్‌, స్మాల్ స్క్రీన్ల‌పై మెరిస్తున్నారు. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడులో నాగార్జున‌, చిరంజీవి మెరిస్తే.. బిగ్‌బాస్‌తో నాని, ఎన్టీఆర్ హోస్టులుగా మారారు. ఇక వీరే కాదు చాలామంది సీనియ‌ర్ హీరోలు ఇప్పుడు బుల్లితెర‌పై త‌మ ట్యాలెంట్‌ను చూపిస్తున్నారు.

ఇక వీటితో పాటు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై కూడా ల‌క్‌ను ప‌రీక్షించుకోవాల‌ని చూస్తున్నారు. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఓటీటీ వెబ్‌సిరీస్ల‌కు ఎంత డిమాండ్ ఉందో తెలుసు క‌దా. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా న‌టిస్తున్నారంటే దీనికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవ‌చ్చు.

ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటీటీలో ఓ వెబ్‌సిరీస్‌లో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు. అల్లు అర‌వింద్ త‌న ఆహాలో చిరంజీవి కోసం ఓ వెబ్‌సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నాడు. మంచి స్ట‌ఫ్ ఉన్న క‌థ‌ల‌ను రెడీ చేస్తున్నాడు. ఇక సురేశ్ బాబు కూడా విక్ట‌రీ వెంక‌టేశ్‌తో తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. మ‌రో డైరెక్ట‌ర్ జ‌యంత్‌తో కూడా ఇంకో వెబ్ సిరీస్ కోసం క‌థ‌ల‌ను రాయిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే రానున్న కాలంలో వెబ్‌సిరీస్‌ల క్రేజ్ పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version